
విశాఖపట్నం నగర నూతన మేయర్ ముక్కా శ్రావణి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి, టీడీపీ నాయకుడు ముక్కా ముత్యాలనాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ముక్కా ముత్యాలనాయుడు గతంలో టీడీపీ తరఫున రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. 2007లో కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు.
ఆయన మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు, కూటమి నాయకులు, టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముత్యాలనాయుడు మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విశాఖపట్నం నూతన మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్, టీడీపీ సీనియర్ నాయకుడు ముక్కా ముత్యాలనాయుడు కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
కుమార్తె మేయర్‌గా ఎన్నికై, బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసే ఘట్టాన్ని చూడకముందే ముత్యాలనాయుడు కన్నుమూయడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. ఈ విషాద వార్తతో బంధువులు, కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు
ముక్కా ముత్యాలనాయుడు మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్తపై జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన నాయకుడు గంట్ల శ్రీనుబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముత్యాలనాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మేయర్ ముక్కా శ్రావణికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదిలా ఉంటే.. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా టీడీపీ తరఫున, కూటమి మద్దతుతో బరిలోకి దిగిన ముక్కా శ్రావణి 2,44,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని మొత్తం 120 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 98 స్థానాలను కైవసం చేసుకున్నారు.
