ఏపీలో పేదలకు ఉగాది కానుక.. 2.5 లక్షలమందికి లబ్ధి.. చంద్రబాబు కీలక ప్రకటన

Date:

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులు కూాడా తగ్గిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు సీఎం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు రెండు శుభవార్తలు చెప్పారు. అమరావతిలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు. కలెక్టర్లు ఇకపై క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సహా పథకాలను అమలు చేస్తూ.. పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఉగాది కానుకగారాష్ట్రంలో మొత్తం 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందించాలని.. జూన్‌లో మరికొందరికి ఇళ్లు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్‌ పేరిట ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని.. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూడౌన్‌ చేసిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు మరింత తగ్గిస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రంలో 6 లక్షల సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఉగాదికి దివ్యాంగులకు ఉచిత బస్సు ఇంద్రధనస్సు పేరుతో సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో భూ వివాదాలు ఉండకూడదన్నారు చంద్రబాబు. రెవెన్యూ అధికారులు ఆ దిశగా పనిచేయాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...