ఎర్ర బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. మిర్చి రైతులకు భారీ లాభాలు

Date:

మిరప రైతులకు గత కొన్ని సంవత్సరాలుగా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. అప్పుల భారంతో అనేక మంది రైతులు మిరప సాగును పూర్తిగా విరమించగా, మరికొందరు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారింది. మార్కెట్లో మిరపకు పెరిగిన డిమాండ్‌తో రైతులకు ఆశాజనక ధరలు లభిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పండే మిరపకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. నాణ్యత, రంగు, రుచి, ఘాటు వంటి లక్షణాలతో ఈ పంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో సరైన ధరలు లేక రైతులు ఇబ్బందులు పడినా, ఈసారి మాత్రం ‘ఎర్ర బంగారం’గా పేరొందిన మిరప రైతులకు మంచి ఆదాయం అందిస్తోంది.

ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెల నుంచి మిర్చి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాలుకు సగటున రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. గత కొన్ని నెలల్లోనే క్వింటాకు రూ.5 వేల వరకు పెరుగుదల నమోదైంది. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు నేరుగా గ్రామాలకే వెళ్లి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు. దీంతో మధ్యవర్తుల ప్రభావం తగ్గి రైతులకు నేరుగా లాభం చేకూరుతోంది.

గుంటూరు మార్కెట్ యార్డులో కూడా భారీ రాక నమోదవుతోంది. గత వారం 1.29 లక్షల బస్తాలు రాగా, అందులో దాదాపు 1.26 లక్షల బస్తాలు అమ్ముడవడం మార్కెట్‌లో డిమాండ్ స్థాయిని సూచిస్తోంది. మరోవైపు ఈసారి కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా మిరప సాగు విస్తీర్ణం తగ్గింది.

ఉత్పత్తి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వంటి కారణాలతో ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది క్వింటాకు రూ.10 వేల లోపు మాత్రమే పలికిన మిరప, ఈసారి రూ.20 వేల దాటింది. ముఖ్యంగా తేజ రకం ధర రూ.19,500 వరకు చేరగా, తాలు రకం కూడా రూ.10 వేలకుపైగా పలుకుతోంది.

మార్కెట్‌లో ధరలు పెరుగుతుండటంతో రైతులు పంట కోత పూర్తయ్యగానే వేగంగా ఆరబెట్టి విక్రయానికి తరలిస్తున్నారు. మొత్తం ఖర్చులు కలిపి ఎకరానికి సుమారు రూ.4 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఒక ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, క్వింటాకు రూ.18 వేల ధర ప్రకారం రూ.4.5 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముంది.

మొత్తంగా, ఈసారి మిరప ధరలు రైతులకు ఊరట కలిగించడంతో పాటు, గత నష్టాలను కొంత మేర పూడ్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....