దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం: రామ్మోహన్ నాయుడు

Date:

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనుకున్న సమయానికే జీఎంఆర్‌ సంస్థ ఎయిర్‌పోర్టును నిర్మించిందని చెప్పారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు(మంగళవారం) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తుది మెరుగుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్‌తో కలిసి బ్రహ్మాండమైన ఎయిర్‌పోర్టును నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారని.. అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మాణం చేపట్టాలని ఆదేశించారని అన్నారు. ఆ ఆదేశాలు మేరకు అనుకున్న సమయానికే జీఎంఆర్‌ సంస్థ ఎయిర్‌పోర్టును నిర్మించిందని చెప్పారు.

ఎయిరో డ్రో లైసెన్స్ కూడా వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభమైన వారం తర్వాత ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు. మోదీ షెడ్యూల్ ఖరారైన తర్వాత తేదీ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. విశాఖ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను భోగాపురానికి తరలిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో 4 కోట్ల మంది ప్రయాణించే విధంగా టెర్మినల్ నిర్మాణం జరుగుతుందన్నారు. 78,000 చదరపు మీటర్ల మేర టెర్మినల్ బిల్డింగ్ నిర్మించామని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు.. దేశంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్టు డిజైన్‌గా ఉందని కితాబిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర కళలు, సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైన్ చేపట్టినట్లు చెప్పారు. దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం నిలవనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...