పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ట్రక్కుల తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం టాటా గ్రూప్ తన నానో కార్ల ప్రాజెక్టును ఉపసంహరించుకున్న సింగూర్‌లో ఇప్పుడు మరోసారి పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు.

భారీ వాహనాల తయారీకి ప్రణాళిక

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన సుకాంత మజుందార్.. సింగూర్‌కు పరిశ్రమలను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రతిపాదిత ప్లాంట్‌లో అశోక్ లేలాండ్ భారీ వాహనాలను తయారు చేయనుందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా పారిశ్రామిక కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని అభిప్రాయపడ్డారు.

నవంబర్ 5న సీఎం ప్రకటన

సింగూర్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అంశంపై అశోక్ లేలాండ్ ప్రతినిధులతో తమ ప్రభుత్వం ప్రాథమిక చర్చలు జరిపినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నవంబర్ 5న వెల్లడించారు. తాజాగా కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ చేసిన ప్రకటనతో ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది.

గతంలో టాటా నానో ప్రాజెక్టు నిలిచిపోయిన సింగూర్‌లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *