స్మార్ట్ పోలీసింగ్‌కు శ్రీకారంవిశాఖ జూలో 128 కొత్త జీవాలు.. సిబ్బందికి పవన్ కల్యాణ్ అభినందనలుస్మార్ట్ పోలీసింగ్‌కు శ్రీకారం

Date:

అమరావతి, ఆగస్టు 25: విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన 128 కొత్త జీవాలు జన్మించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఆయన స్పందిస్తూ.. ప్రతి కొత్త జీవం కొత్త ఆశలను నింపుతుందని, ఒక జాతిని సంరక్షించడం అంటే ప్రకృతి సంపదను కాపాడుకోవడమేనని పేర్కొన్నారు.

విశాఖ జూలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ చర్యలు రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు మరింత బలం చేకూరుస్తున్నాయని అన్నారు.

కృత్రిమ ఇంక్యుబేషన్‌ విధానం ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, ఒక బ్లూ-గోల్డ్‌ మకావ్‌ పిల్లను విజయవంతంగా పొదిగించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన అంశమని పేర్కొన్నారు. ఈ పునరుత్పత్తి కార్యక్రమంలో భాగస్వాములైన అటవీ శాఖ అధికారులు, జూలాజికల్‌ పార్క్‌ సిబ్బంది, వెటర్నరీ బృందాన్ని పవన్‌ కల్యాణ్‌ అభినందించారు.

శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ జీవవైవిధ్యాన్ని భావితరాలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...

సుజ్లాన్ S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

https://www.youtube.com/watch?v=1zGJfDlgPvg D-News: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో ముందడుగు పడింది. సుజ్లాన్...

గులాబీ మొక్క కొమ్మ కొమ్మకీ మొగ్గలు రావాలంటే.. ఈ ఒక్క స్పూన్ వేయండి! నర్సరీలో పాటించే చిట్కా ఇదే.

ఇంటి పెరట్లోనూ, బాల్కనీ కుండీల్లోనూ గులాబీ మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు....

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో...