AP Local Body Polls 2026 Result : ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లలో ఉన్న మొత్తం 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం అవ్వగా 804 డివిజన్లలో కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 87 ఛైర్‌పర్సన్‌ స్థానాలు ఉండగా అందులో 17 స్థానాలు ఏకగీవం అయ్యాయి. తాజాగా జరుగుతున్న కౌటింగ్‌లో పెద్దాపురం మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్‌ 773 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లలో ఉన్న మొత్తం 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం అవ్వగా 804 డివిజన్లలో కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 87 ఛైర్‌పర్సన్‌ స్థానాలు ఉండగా అందులో 17 స్థానాలు ఏకగీవం అయ్యాయి. వీటిలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నికల్లో టీడీపీకి 15, జనసేన, బీజేపీలకు చెరొకటి ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 70 స్థానాలకు ఎన్నికలు జరగతా ప్రస్తుతం కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,020 మున్సిపల్ వార్డు స్థానాలు ఉంగడా.. అందులో 637 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 2,382 వార్డులకు ఎన్నికలు జరగ్గా ఆయా వార్డుల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న కౌటింగ్‌లో ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యంగా పెద్దాపురం మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్‌ 773 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని ఏడో వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.

AP Municipal Election 2026 Winners (ఏకగ్రీవాలు):

మున్సిపాలిటీ పేరుగెలిచిన అభ్యర్థిపార్టీ
పిడుగురాళ్లషేక్‌ బాబావలీటీడీపీ
గురజాలనెలవల్లి బొల్లయ్యటీడీపీ
దాచేపల్లితంగెళ్ల శ్రీనివాసరావుటీడీపీ
కనిగిరిఅచ్చాల తిరుపతమ్మరెడ్డిటీడీపీ
నగరిఇ.నారాయణ శ్రీనివాసన్‌టీడీపీ
పుంగనూరునయీం తాజ్‌టీడీపీ
రాయచోటిబోనుమల ఖాదర్‌వలీటీడీపీ
రాజంపేటదొంతం గాయత్రిటీడీపీ
ప్రొద్దుటూరునంద్యాల రాఘవరెడ్డిటీడీపీ
బద్వేలుసోమేశుల దివ్యతేజటీడీపీ
మైదుకూరుధనపాల జగన్‌మోహన్‌టీడీపీ
కమలాపురంగొంగల్‌రెడ్డి స్వప్నటీడీపీ
గుత్తిగోవిందరాజుల తమిళ్‌సెల్విటీడీపీ
ఆళ్లగడ్డషేక్‌ అనీషాటీడీపీ
ఆత్మకూరుడాక్టర్‌ ఆవుల గోవిందరాజులుటీడీపీ
ఎర్రగుంట్లగొర్ల మధులతబీజేపీ
దర్శిదారం సుబ్బారావుజనసేన

By Hemanth