ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీయూకేటీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి డిసెంబరు 2న జరగాల్సిన ప్రాథమిక పరీక్షను పరిపాలనాపరమైన కారణాలతో డిసెంబరు 9కి వాయిదా వేసింది. మిగతా పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అభ్యర్థులకు కీలక అప్డేట్ ప్రకటించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు (Assistant Professor), ఆర్జీయూకేటీ (RGUKT)లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన ప్రాథమిక పరీక్ష తేదీలో మార్పు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను డిసెంబరు 2న నిర్వహించాల్సి ఉంది. అయితే పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ ప్రాథమిక పరీక్షను డిసెంబరు 9న నిర్వహించనున్నారు.

ఇతర పరీక్షల్లో మార్పు లేదు

అభ్యర్థులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డిసెంబరు 2 నుంచి వాయిదా పడిన ఈ పరీక్ష మినహా మిగతా తేదీల్లో జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇతర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీ మారిన నేపథ్యంలో అభ్యర్థులు కొత్త తేదీని దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యే తాజా ప్రకటనలు, హాల్‌టికెట్లు, పరీక్షకు సంబంధించిన ఇతర సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులకు మరో వారం రోజుల అదనపు సమయం లభించనుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రివిజన్, మాక్ టెస్టులపై దృష్టి పెట్టడం మంచిది. డిసెంబరు 2న జరగాల్సిన ప్రాథమిక పరీక్ష డిసెంబరు 9కు వాయిదా పడిన విషయం అభ్యర్ధులు గమనించాలని, తదనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలని కమిషన్‌ సూచించింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *