
D news:nov:18కొత్తిమీర కట్టను విప్పి పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన, కుళ్లిన ఆకులను వేరు చేసి తొలగించాలి. కాడలకు లేదా వేర్లకు అంటుకున్న మట్టిని శుభ్రం చేయాలి. వీలైనంత వరకు కొత్తిమీరను కడగకుండా నిల్వ చేయడం మంచిది. ఒకవేళ కడిగితే మాత్రం శుభ్రమైన కాటన్ వస్త్రం లేదా కిచెన్ టవల్‌పై పరిచి పూర్తిగా ఆరబెట్టాలి.
కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే టిష్యూ పేపర్ చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బాను తీసుకోవాలి. దాని అడుగున ఒక పొడి టిష్యూ పేపర్ పరచి, దానిపై కొత్తిమీర ఆకులను సర్దాలి. అనంతరం ఆకుల పైన మరో టిష్యూ పేపర్ ఉంచి డబ్బా మూతను గట్టిగా మూసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
కొత్తిమీరను సాధారణంగా చాలామంది ప్లాస్టిక్ కవర్లలో వేసి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే వాటిలో తేమ పేరుకుపోవడం వల్ల ఆకులు త్వరగా నల్లబడటం, జిగటగా మారడం, కుళ్లిపోవడం జరుగుతుంది. టిష్యూ పేపర్ ఉపయోగించడం వల్ల ఆకుల్లోని అదనపు తేమను పీల్చుకుని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
కొత్తిమీర నిల్వ చేసిన డబ్బాను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి తెరిచి చూడాలి. టిష్యూ పేపర్ తడిగా మారితే వెంటనే కొత్తది మార్చాలి. అలాగే మధ్యలో ఏవైనా ఆకులు పాడైనట్లు కనిపిస్తే వెంటనే తొలగించాలి. ఇలా చేయడం వల్ల మిగతా ఆకులు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి.
కొత్తిమీరను నిల్వ చేసే సమయంలో తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సులభమైన పద్ధతిని పాటిస్తే కొత్తిమీరను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. ప్రతిసారీ మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.
