
కోడూరు : కోడూరు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఉల్లిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు మద్దాల ప్రియాంక ఎంపికయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆమెకు పార్టీ బీ-ఫారాన్ని అందజేసింది.
నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ విక్కుర్తి జయలక్ష్మి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు కలిసి ప్రియాంకకు బీ-ఫారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మాచర్ల భీమయ్య, అప్పికట్ల రవీంద్రబాబు, ముద్దినేని చంద్రరావు, కాగిత ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, కొక్కిలిగడ్డ జాన్ విల్సన్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
