
హాంకాంగ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ రక్షితశ్రీ రామరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రక్షిత 21-18, 24-22 తేడాతో యుఫెయ్‌పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
నా కెరీర్‌లో ఇదే అత్యుత్తమ విజయం: రక్షిత
ప్రపంచ స్థాయి క్రీడాకారిణిపై విజయం సాధించడంతో రక్షితశ్రీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయాన్ని తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన ఘనతగా అభివర్ణించింది. చెన్ యుఫెయ్‌కు తాను వీరాభిమానినని, అలాంటి క్రీడాకారిణిని ఓడించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపింది. తన బ్యాడ్మింటన్ ప్రయాణంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేసింది.
