జనసేన, టీడీపీ, బీజేపీ బలమైన కూటమి. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి.

‘జనసేన, టీడీపీ, బీజేపీ బలమైన కూటమి. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. వాటిని ఐక్యంగా ఎదుర్కొని తిప్పికొడతాం’ అని ఏపీ గ్రీన్‌ ఆంధ్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ప్రత్తిపాడులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

‘ఈ కూటమి విడిపోయే ప్రసక్తే లేదు. టీడీపీ, జనసేన, బీజేపీది ఓకే మాట, ఒకే బాట. సీట్ల సర్దుబాటులో చిన్న మనస్పర్ధలు రావడం సహజం. ఎన్నికల అనంతరం విభేదాలు ఉండవు. మేమంతా రాష్ర్టాభివృద్ధే అజెండాగా పనిచేస్తాం. వైసీపీ రాక్షస పాలన రాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *