ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆ వెంటనే..

Date:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్యాస్ పైపు లీక్ కారణంగా వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్‌ పెట్రోల్ పంపు పాఠశాలలోని వంటగదిలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.. చూస్తుండగానే.. భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే.. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి మద్యాహ్నం భోజనం పథకం అమలవుతుండటంతో వంట సిబ్బంది ఉదయం 9 గంటలకే వంట పని మొదలు పెట్టారు‌. విద్యార్థులంతా అప్పటికే పాఠశాలకు చేరుకుని తరగది గదుల్లోకి వెళ్లిపోయారు. క్లాసులు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా వంటగదిలో పెద్ద శబ్దంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏం జరిగిందో అన్నభయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వంట సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

వంటగదిలో సిలెండర్ పైప్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగినట్టుగా గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు‌. ప్రమాదంతో అలర్ట్ అయి‌న ఉపాధ్యాయులు విద్యార్థులను క్లాస్ రూంల నుండి వెంటనే సురక్షితంగా బయటకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు‌. ప్రమాద సమయంలో పాఠశాలలో 450 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం‌. ఈ ప్రమాదంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....