చలి కాలంలో చాలా మంది కాళ్ల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుంది. కాళ్లకు పగుళ్లు రావడం, వాటి నుంచి నొప్పి రావడం వంటివి ఇబ్బందికరంగా ఉంటాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలి? బయట దొరికే క్రీములు వాడకుండా, ఇంటి చిట్కాలతోనే, మన ఇంట్లో ఉండే పదార్థాలతో కాళ్ల పగుళ్లను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం..

కాళ్ల పగుళ్లు అసలు ఎందుకు వస్తాయంటే, పాదాలు బాగా పొడిబారిపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మనం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. ఈ విధంగా మన ఇంట్లోనే అందుబాటులో ఉండే వాటితోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కాళ్ల పగుళ్లు ఎక్కువగా ఉండి, రక్తం రావడం లేదా తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

కాళ్ల పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు నీటిలో పాదాలను ఉంచకూడదు. సబ్బు నీటిలో ఎక్కువసేపు నిలబడటం వంటివి తగ్గించాలి. రాత్రిపూట పాదాలను శుభ్రంగా కడుక్కొని, మెత్తని బట్టతో తుడుచుకోవాలి. ఆ తర్వాత పాదాలకు వాసెలిన్ రాసుకుని, సాక్సులు వేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతిరోజూ రాత్రి చేసినట్లయితే క్రమంగా కాళ్ల పగుళ్లు తగ్గడానికి సహాయపడుతుంది.

వారానికి ఒకసారి గోరువెచ్చని నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచి, పాదాలను బాగా మర్ధన చేసి శుభ్రం చేసుకోవాలి. రెండు స్పూన్ల బియ్యప్పిండిలో కొద్దిగా పచ్చిపాలు, ఒక స్పూను తేనె వేసి బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ఒకసారి చేసుకోవచ్చు.

ఒక స్పూన్ మంచి పసుపు తీసుకుని దానిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి పాదాలకు రాసుకోవాలి ఇలా చెయ్యడం వల్ల కాళ్ల పగుళ్లు త్వరగా తగ్గుతాయి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక స్పూను కొబ్బరి నూనెలో రెండు, మూడు నిమ్మచుక్కలు కలిపి పాదాలకు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు పొడిబారకుండా ఉండటానికి సహాయపడుతుంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *