మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి లోకేశ్

Date:

తమ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ‘మన ఇల్లు – మన లోకేశ్’ పేరుతో మంగళగిరిలో ఈరోజు (మంగళవారం) ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు.

లోకేశ్ చేతుల మీదుగా మూడువేల మందికి ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఇళ్లపట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు రూ.1000కోట్ల ఆస్తిని ఇళ్లపట్టాల రూపంలో అందసినట్లు లోకేశ్ వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూ.1. ఉంటే ఖర్చు రూ.1.60పైసలుగా ఉందని వివరించారు. రెండేళ్ల అభివృద్ధితో ఖర్చు రూ.1.40కి చేరిందని తెలిపారు. నేడు ఇచ్చే శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామని లోకేశ్ ఉద్ఘాటించారు. 2019లో తన ఓటమికి సీఎం చంద్రబాబును కూడా కొంతమంది అవహేళన చేశారని ధ్వజమెత్తారు. ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో నంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....