NBK : “అఖండ 2 హంగామా మొదలైంది: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి గౌరవ అతిధి!”

Date:

నందమూరి బాలకృష్ణ–డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ సీక్వెల్ ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సందడి సృష్టించింది. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డైలాగ్స్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘జాజికాయ జాజికాయ’ కోటి వ్యూస్ దాటి సెన్సేషన్‌గా మారింది. రామ్ ఆచంట–గోపి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ 2ను వరల్డ్‌వైడ్‌గా 3Dలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌కు మరింత వేగం ఇచ్చింది టీమ్. దాని భాగంగానే అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల నవంబర్ 28న జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

అలాగే, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని కూడా ఆహ్వానించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్ర షూటింగ్‌తో బన్నీ బిజీగా ఉండటం వల్ల ఈ ఈవెంట్‌కు హాజరుకాలేరని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగే సక్సెస్ మీట్‌కు ఆయన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు, డిసెంబర్ 4న రాత్రి నుంచే ప్రీమియర్ షోలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇందుకు కావాల్సిన అనుమతుల కోసం వారు ఎదురుచూస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...