Akhanda 2 : అఖండ 2 ప్రీ రీలీజ్ ఈవెంట్ లొకేషన్, టైమింగ్ అవుట్ – ఫాన్స్ రెడీ అవ్వండి !

Date:

నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కలిసి వస్తే ఎలాంటి హంగామా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పవర్‌ఫుల్ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ‘అఖండ 2’ రూపంలో ప్రేక్షకులను కలవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో అభిమానుల్లో హైప్ ఊహాతీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలయ్య లుక్, ఆరకట్టు హావభావాలు, బోయపాటి స్టైల్ మాస్ ఎలిమెంట్స్ థియేటర్లలో మరోసారి భారీ దుమారం రేపబోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రిలీజ్ చేసిన ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచే కాకుండా ఫ్యామిలీ సర్క్యూట్‌ నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసిన మూవీ టీమ్, ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.

ఈసారి ఈవెంట్‌ను సాధారణ వేడుకలా కాకుండా టాక్ ఆఫ్ ది టౌన్గా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, రాజకీయ వర్గాల నుంచి కూడా హై-ప్రొఫైల్ హాజరు ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా రానున్నారు. అదనంగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

ఇక తాజాగా ఈ వేడుకకు సంబంధించిన లొకేషన్, టైమింగ్‌ను టీమ్ ఫైనలైజ్ చేసింది. నవెంబర్ 28న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్, కుకట్‌పల్లిలో ఈ భారీ ప్రీ రీలీజ్ ఈవెంట్ గ్రాండ్గా ప్రారంభం కానుంది. భారీ కటౌట్లు, మాస్ అట్మాస్ఫియర్‌, లైవ్ పెర్ఫార్మెన్సులతో ఈ వేదిక బాలయ్య అభిమానులకు నిజమైన పండగగా మారడం ఖాయం.

మొత్తం మీద, ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికే హైప్‌ను రెట్టింపు చేస్తూ, అభిమానుల్లో కౌంట్‌డౌన్‌ మూడ్‌ను మ‌రింత పెంచేస్తోంది. నవెంబర్ 28న కైతలాపూర్ గ్రౌండ్‌ మొత్తం అఖండ మాస్ ఫెస్ట్‌గా మారడం ఖాయం!

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...