కార్యాలయంలో పనిచేసే మహిళలకు మాతృత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వృత్తిపరమైన ప్రతికూలతగా మారకూడదని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రసూతి సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఓ మహిళా చార్టర్డ్ అకౌంటెంట్‌ను మేనేజర్ స్థాయి నుంచి క్లరికల్ హోదాకు తగ్గించిన ప్రైవేట్ సంస్థకు కోర్టు రూ.10 లక్షల నష్టపరిహారం విధించింది.

మాతృత్వ సెలవుల సమయంలో మహిళలకు కల్పించే చట్టపరమైన రక్షణ కేవలం ఉద్యోగ భద్రతకే పరిమితం కాదని కోర్టు స్పష్టం చేసింది. వారి వృత్తిపరమైన హోదా, కెరీర్ పురోగతి, ప్రమోషన్లపైనా ఈ రక్షణ వర్తిస్తుందని పేర్కొంది.

అంతేకాకుండా, ప్రసూతి సెలవుల అనంతరం మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరే సమయంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేలా సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల్లోగా తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది.

ఉద్యోగం చేస్తున్న మహిళలకు మాతృత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కెరీర్‌కు అడ్డంకిగా లేదా అవమానభారంగా మారకూడదని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రసూతి సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరిన ఓ మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) హోదాను తగ్గించిన ప్రైవేట్ సంస్థకు కోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది.

ఈ మొత్తాన్ని బాధిత మహిళకు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించిన కోర్టు, అదనంగా రూ.1.5 లక్షలను కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని సంస్థను ఆదేశించింది.

అంతేకాకుండా, ప్రసూతి సెలవుల సమయంలో మహిళలకు చట్టం కల్పించే రక్షణ కేవలం ఉద్యోగంలో కొనసాగింపుకే పరిమితం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వారి వృత్తిపరమైన హోదా, ప్రమోషన్లు, కెరీర్ పురోగతి వంటి అంశాలకు కూడా ఈ చట్టపరమైన రక్షణ వర్తిస్తుందని పేర్కొంది. మాతృత్వం కారణంగా మహిళల వృత్తిపరమైన అవకాశాలు, గౌరవం దెబ్బతినకుండా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ తీర్పు స్పష్టం చేసింది.

ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ ప్రసూతి సెలవుపై వెళ్లారు. సెలవులు పూర్తయ్యాక తిరిగి విధుల్లో చేరిన ఆమెకు కంపెనీ పాత హోదాను పునరుద్ధరించకుండా, ట్రెజరీ విభాగంలో క్లరికల్ స్థాయి విధులను మాత్రమే అప్పగించింది. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు.

అనంతరం తనకు జరిగిన అన్యాయంపై న్యాయవాది పారుల్ సింగ్ ద్వారా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *