
ఏలూరు: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అకాల మరణం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఏలూరులోని నాని నివాసానికి చేరుకున్న లోకేష్.. ఆయన పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకేష్‌తో పాటు రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డా. నిమ్మల రామానాయుడు, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొని ఆళ్ల నానికి నివాళులర్పించారు.
