ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన 15 జిల్లాల్లో జిల్లా పరిషత్‌ (జడ్పీ) కార్యాలయాలు ఈ నెల 25 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత జడ్పీ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుండటంతో.. మరుసటి రోజు నుంచి కొత్త జిల్లాల పరిధిలో జడ్పీ పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

కొత్త జిల్లాల్లో జడ్పీ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక భవనాల్లో కార్యాలయాల ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది విభజన వంటి ప్రక్రియలను అధికారులు వేగవంతం చేశారు.

కొత్త జిల్లాల జడ్పీ పరిపాలన కోసం 15 మంది సీఈవోలు, 15 మంది డిప్యూటీ సీఈవోల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అర్హులైన అధికారులకు పదోన్నతులు కల్పించి ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే పాత జడ్పీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని విభజించి కొత్త జిల్లాలకు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలను ప్రారంభించనుండగా.. భవిష్యత్‌లో శాశ్వత భవనాలు, పూర్తిస్థాయి మౌలిక వసతులతో జడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *