శ్రీకాకుళం జిల్లాలో నదులు, చెరువులు, వాగులతో పాటు సుదీర్ఘ సముద్రతీరం ఉండటంతో వినాయక నిమజ్జన సమయంలో అప్రమత్తత అవసరం. గతంలో నిమజ్జనం, విద్యుత్‌ అలంకరణల సమయంలో చోటుచేసుకున్న పలు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి.

  • హడ్కో కాలనీలో విషాదం: రెండేళ్ల క్రితం శ్రీకాకుళం హడ్కో కాలనీలో వినాయక నవరాత్రి వేడుకల్లో విద్యుత్‌ తీగలు తగలడంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
  • బురిడికంచరాంలో అపశ్రుతి: ఐదేళ్ల క్రితం పొందూరు మండలం బురిడికంచరాంలో నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్‌ చక్రాలు బురదలో కూరుకుపోవడంతో విగ్రహం పడిపోయి ఆరేళ్ల బాలుడు యారబాటి వేణుగోపాల్‌ మృతి చెందాడు.
  • నరసన్నపేటలో విద్యుత్‌ ప్రమాదం: వినాయక వేడుకల్లో లైటింగ్‌ ఏర్పాటు చేస్తుండగా కర్ర విద్యుత్‌ తీగలకు తగలడంతో అలిగి హేమంత్‌కుమార్‌ అనే యువకుడు మృతి చెందాడు.
  • సారవకోటలో మరో విషాదం: ఐదేళ్ల క్రితం బుడితిలో నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాక్టర్‌పై ఉన్న ధర్మాన రాంబాబుకు విద్యుత్‌ తీగలు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గత ఘటనలను దృష్టిలో పెట్టుకుని నిమజ్జన సమయంలో విద్యుత్‌ తీగలు, నీటి వనరులు, వాహనాల విషయంలో నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *