
బెంగళూరులో ఆస్తిపన్ను చెల్లించే ఇళ్ల యజమానులపై మరో అదనపు భారం పడనుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలో ఆస్తిపన్నుతో పాటు రూ.200 సాఫ్ట్వేర్ చార్జీ వసూలు చేస్తున్నట్లు సమాచారం. వాణిజ్య భవనాలకు ఈ చార్జీ రూ.1,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా కొత్త చార్జీ విధించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్) తీవ్రంగా స్పందించాయి. ప్రజలపై అదనపు భారం మోపుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశాయి.
ఇళ్ల యజమానుల నుంచి వసూలు చేస్తున్న ఈ అదనపు మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
