రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సత్యసాయి విమానాశ్రయానికి తరలివచ్చారు.

మంగళవారం ఉదయం 8.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్‌కు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు లోకేష్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో విమానాశ్రయ పరిసరాల్లో సందడి నెలకొంది. నాయకులు, కార్యకర్తల నినాదాలతో కొద్దిసేపు వాతావరణం ఉత్సాహంగా మారింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సవిత, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, దగ్గుబాటి వెంకటప్రసాద్, బండారు శ్రావణి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ ప్రజాప్రతినిధులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు తదితరులు పాల్గొన్నారు. కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా నారా లోకేష్‌కు స్వాగతం పలికారు.

నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సమీకరించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *