విజయవాడలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలా లేదని, నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న విమర్శించారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బుద్ధా వెంకన్న తెలిపారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద అర్హత సాధించిన క్రీడాకారులకు డీఎస్సీ ఉద్యోగాలు లభించడంతో నిరుద్యోగ యువతలో ఆనందం నెలకొందన్నారు.

కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మార్పులు తీసుకొస్తున్న మంత్రి నారా లోకేశ్‌పై రాజకీయ అసూయతోనే వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని బుద్ధా వెంకన్న అన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *