అయ్యో.. ఎంత పని జరిగింది మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు!

Date:

పని నిమిత్తం మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన గొడవలో.. అనంతపురం బస్టాండ్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హఠాత్తు పరిణామంతో షాకైన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన ఆదర్శ్ (25) పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు మిత్రులతో కలిసి అనంతపురం బస్టాండ్ కి వచ్చాడు. తెల్లవారుజామున అల్పాహారం కోసం బస్టాండ్ సమీపంలోని హోటల్ కు మిత్రులతో కలిసి ఆదర్శ్ వెళ్లాడు. టిఫిన్ చేసి బస్సు ఎక్కేందుకు హోటల్ నుంచి బయటకు వచ్చాడు.

ఈ సమయంలో ద్విచక్ర వాహనం పక్కకు తీసే విషయంలో మద్యం మత్తులో ఉన్న బన్నీ, కరుణాకర్ తో యువకుడు ఆదర్శ్ కు మధ్య గొడవ చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న బన్నీ, కరుణాకర్. పగిలిన పదునైన టైల్స్ రాయితో ఆదర్శ్ ఛాతిపై బలంగా పొడిచారు. తీవ్ర గాయాలతో కుప్పకూలి కింద పడిపోయిన ఆదర్శ్‌ను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు ఆదర్శ్ మృతి చెందాడు. గొడవపడిన ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అనంతపురం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కుతాడు అనగా.. మద్యం మత్తులో జరిగిన గొడవ.. యువకుడు హత్యకు దారి తీసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...