ఒక్కరోజే 24 క్యారెట్లపై రూ.76, 22 క్యారెట్లపై రూ.70 తగ్గుదల.. నవంబర్‌లో ఇప్పటివరకు 2.04 శాతం క్షీణత

ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్రతినిధి: బంగారం కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు తాజాగా మరోసారి తగ్గాయి. నవంబర్ 17న 24 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.76, 22 క్యారెట్ల బంగారంపై రూ.70 తగ్గింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,040కు, 22 క్యారెట్ల ధర రూ.1,24,700కు చేరింది.

నవంబర్ నెలలో ఇప్పటివరకు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 1న నమోదైన ధరలతో పోలిస్తే నవంబర్ 17 నాటికి 24, 22 క్యారెట్ల బంగారం ధరలు రెండూ 2.04 శాతం తగ్గాయి. నవంబర్ 5న గరిష్ఠ స్థాయికి చేరిన పసిడి ధరలు ఆ తర్వాత నుంచి క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరల్లో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి.

పది గ్రాముల బంగారం ధర ఎంతంటే?

నవంబర్ 17 నాటి ధరల ప్రకారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,36,040గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,24,700 పలుకుతోంది. ఎనిమిది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,832 కాగా, 22 క్యారెట్ల ధర రూ.99,760గా ఉంది.

ఇక వంద గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.13,60,400కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,47,000గా నమోదైంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *