నీటి నాణ్యతకు సంబంధించి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FSSAI) నుంచి నోటీసులు అందిస్తున్నట్టు వచ్చిన వార్తా కథనాలపై బిస్లరీ కంపెనీ తాజాగా స్పందించింది.

టి నాణ్యతకు సంబంధించి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FSSAI) నుంచి నోటీసులు అందిస్తున్నట్టు వచ్చిన వార్తా కథనాలపై బిస్లరీ కంపెనీ తాజాగా స్పందించింది. తమ మినరల్ వాటర్ సురక్షితమని స్పష్టం చేసింది. ఎలాంటి సంకోచం లేకుండా బిస్లరీ నీళ్లను వినియోగించవచ్చని పేర్కొంది. బిస్లరీ నీళ్ల శాంపిల్స్‌లో కలుషితాలు ఉన్నట్టు బయటపడటంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ విచారణకు సిద్ధమైన నేపథ్యంలో బిస్లరీ ఈ ప్రకటన జారీ చేసింది. గోవాలోని తయారైన బిస్లరీ బాటిల్స్‌‌లో ఓ బ్యాచ్‌కు చెందిన వాటిని పరీక్షించగా అందులో బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

ఈ వార్తా కథనాలపై బిస్లరీ స్పందిస్తూ ఈ ఉదంతం 14 నెలల క్రితం నాటిదని పేర్కొంది. మొదటి ఐదు శాంపిల్స్‌ అప్పట్లో ఆహార ఔషధ నియంత్రణ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఏ సమస్యా లేకపోయినా 6వ శాంపిల్‌లో బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్టు తెలిపింది. ఈ క్రమంలో అప్పీల్ చేయగా ఓ రిఫరల్ ల్యాబ్‌లో మళ్లీ జరిపిన పరీక్షల్లో క్లీన్‌చిట్ వచ్చినట్టు బిస్లరీ తెలిపింది.

తాము నాణ్యత విషయంలో పక్కాగా ఉంటామని బిస్లరీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 10 దశల్లో 90కి పైగా పరీక్షల తర్వాతే నీళ్లను విక్రయిస్తామని చెప్పింది. వినియోగదారుల ఆరోగ్యమే తమకు తొలి ప్రాధాన్యమని పేర్కొంది. ఇక తాజా ఉదంతంలో ఆహార ఔషధ నియంత్రణ సంస్థకు అన్నిరకాలుగా సహకరిస్తామని కూడా బిస్లరీ హామీ ఇచ్చింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *