ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి దౌర్జన్యాలకు పాల్పడి విజయం సాధించిందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పులివెందులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, రిగ్గింగ్‌కు పాల్పడి కూటమి అభ్యర్థులు గెలిచారని పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ శ్రేణులకు పోలీసులు సహకరించారని, ఎన్నికల సంఘం కూడా పక్షపాతంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇది నిజమైన విజయమేనా అంటూ ప్రశ్నించారు.

వైసీపీకి చెందిన చురుకైన కార్యకర్తలను పోలీసులు బైండోవర్ చేశారని, టీడీపీకి చెందిన గూండాలు, రౌడీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

మరోవైపు రాష్ట్రంలో ఇటీవల వచ్చిన రెండు తుపాన్ల కారణంగా నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం తగిన సహాయం అందించలేదని పేర్ని నాని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు రైతు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి, విపత్తుల సమయంలో రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.

20 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, జాబితాను విడుదల చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, రైతుల సమస్యలు, ఉద్యోగాల కల్పన అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *