
D news :nov:19అందుకే కార్పెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. బయట నుంచి ఇంట్లోకి వచ్చే దుమ్ము, ధూళిని నివారించేందుకు చెప్పులు, బూట్లను గుమ్మం బయటే వదిలేయాలి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద డోర్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి. పెంపుడు జంతువులు ఉన్నవారు వాటి వెంట్రుకలను తొలగించేందుకు ప్రత్యేకమైన పెట్ హెయిర్ వాక్యూమ్ బ్రష్‌లను ఉపయోగించాలి.
కార్పెట్‌లో పేరుకుపోయే సూక్ష్మ ధూళికణాలు, అలర్జీ కారకాలను తొలగించేందుకు HEPA ఫిల్టర్ ఉన్న వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం మంచిది. వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు కార్పెట్‌ను వాక్యూమ్ చేయాలి. అలాగే ఏడాదికి కనీసం ఒక్కసారైనా ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవాలి. ముఖ్యంగా స్టీమ్ క్లీనింగ్ ద్వారా పేరుకుపోయిన మురికిని తొలగించవచ్చు.
కార్పెట్‌పై ఏవైనా మరకలు పడితే ఆలస్యం చేయకుండా వెంటనే శుభ్రం చేయాలి. లేకపోతే అవి లోపలి పొరల్లోకి ఇంకిపోయి తొలగించడం కష్టమవుతుంది. మరకలను తొలగించేందుకు కార్పెట్ తయారీదారు సూచించిన క్లీనింగ్ ఉత్పత్తులను ఉపయోగించాలి. కొన్ని రకాల మరకలకు బేకింగ్ సోడా లేదా వైట్ వెనిగర్ ఉపయోగపడతాయి. అయితే ముందుగా కార్పెట్‌లో కనిపించని చిన్న భాగంలో పరీక్షించాలి.
క్లీనింగ్ పూర్తయిన తర్వాత కార్పెట్ పూర్తిగా ఆరేలా చూడాలి. తేమ అలాగే ఉంటే దుర్వాసన, బూజు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కార్పెట్ నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన కార్పెట్ ఇంటి అందాన్నే కాదు.. ఇంట్లోని గాలి నాణ్యతను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సహాయపడుతుంది.
