అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా.. ఓఎన్జీసీతో సమన్వయం చేసుకుని లీకేజీని అదుపు చేయాలని సూచన

కోనసీమ: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

గ్యాస్ లీకేజీ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై ఓఎన్జీసీ ఛైర్మన్‌తో స్వయంగా మాట్లాడి, భద్రతా చర్యలను సమీక్షించాలని అధికారులకు సూచించారు.

పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *