CSK పతనాన్ని శాసించిన జడేజా.. ఆ ఒక్క ఓవర్‌తో సీన్ రివర్స్! జడ్డూ సెలబ్రేషన్స్ వైరల్

Date:

ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సంజూ శాంసన్ కోసం రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది. కానీ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే కుప్పకూలడానికి కారణం అదే జడేజా కావడం విశేషం. గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ప్రారంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్క ఓవర్‌లోనే సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు శివమ్ దూబేను ఔట్ చేసి సీఎస్‌కేకు గట్టి షాక్ ఇచ్చాడు.

చెన్నై నుంచి రాజస్థాన్‌లోకి మారిన రవీంద్ర జడేజానే సీఎస్‌కే పతనానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే తన విలువ ఏమిటో జడేజా చూపించాడు. గువాహటి మ్యాచ్‌లో సీఎస్‌కే ఘోర ఓటమి చవిచూసింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమికి జడేజా పాత్ర కీలకంగా మారింది.

ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బౌలింగ్‌ను ఎంచుకోగా, సీఎస్‌కే ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, బర్గర్ అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్‌కే టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయి చెన్నై తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడుతూ రాజస్థాన్ బౌలర్లపై ప్రతిదాడి చేశాడు. అదే సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ బంతిని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. 8వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన జడేజా రెండో బంతికే సర్ఫరాజ్‌ను ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే తొలి బంతినే సిక్సర్‌గా కొట్టాడు. దీంతో ప్లాన్ మార్చుకున్న జడేజా అదే ఓవర్ చివరి బంతికి దూబే వికెట్‌ను కూడా తీసేశాడు.

జడేజా వేసిన ఈ కీలక ఓవర్‌తో సీఎస్‌కే పతనం ఖరారైంది. ఎందుకంటే సర్ఫరాజ్ క్రీజులో ఉండి ఉంటే, దూబే కూడా సెట్ అయితే చెన్నై మంచి స్కోర్ సాధించే అవకాశం ఉండేది. కానీ ఇద్దర్నీ ఒకే ఓవర్‌లో ఔట్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పాడు. దూబే వికెట్ తీసిన తర్వాత జడేజా చేసిన పిస్టోల్ స్టైల్ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతూ 12.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచిన సీఎస్‌కే, ఈసారి కూడా అదే తరహా ప్రదర్శన కనబరచడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...