GATE 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. ఆగస్టు 27న ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణకు IIT మద్రాస్ కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. త్వరలో రిజిస్ట్రేషన్ తేదీలను వెల్లడించనుంది. ఈసారి భారతీయ అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను DigiLocker ద్వారా నిర్వహించనుండటంతో, అభ్యర్థులు ముందుగానే ఖాతాను సిద్ధం చేసుకోవాలని సూచించారు..

 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం మరోమారు వాయిదా పడింది. ఈ మేరకు ఐఐటీ మద్రాస్ (IIT Madras) దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 27న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించలేదు. సవరించిన కొత్త తేదీల వివరాలను త్వరలోనే అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని తన ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 14 నుంచి 27కి మారిన ఈ ప్రక్రియ, ప్రస్తుతం మరింత ఆలస్యం కావడానికి కారణాలను ఐఐటీ మద్రాస్ వెల్లడించలేదు.

ఈసారి గేట్ 2027 కి సంబంధించి ఐఐటీ మద్రాస్ కీలక మార్పు చేసింది. భారతీయ అభ్యర్థులందరూ తప్పనిసరిగా డిజిలాకర్ (DigiLocker) ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ విండో మొదలయ్యే నాటికి డిజీలాకర్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ వేగంగా పూర్తికావడానికి అభ్యర్థులు ముందుగానే తమ డిజిలాకర్ ఖాతాలను క్రియేట్ చేసుకోవడంతోపాటు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. అలాగే రిజిస్ట్రేషన్‌ విండో ప్రారంభమైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. GATE 2027కు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీలు, ఫీజులు, పరీక్ష షెడ్యూల్‌, ఇతర ముఖ్యమైన సూచనల కోసం అధికారిక GATE వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

ATE 2027 రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ కింది సర్టిఫికెట్లను ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి..

  • ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం
  • చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్‌ స్కాన్ కాపీ
  • పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో ఇదే గుర్తింపు పత్రం ఒరిజినల్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • SC/ST సర్టిఫికెట్‌ స్కాన్ కాపీ (వర్తించే అభ్యర్థులకు)
  • UDID లేదా PwD సర్టిఫికెట్‌ స్కాన్ కాపీ (వర్తించే అభ్యర్థులకు)
  • డిస్లెక్సిక్ సర్టిఫికెట్‌ స్కాన్ కాపీ (వర్తించే అభ్యర్థులకు)
  • కాంపెన్సేటరీ టైమ్‌, స్క్రైబ్‌ సదుపాయం అవసరమైతే సంబంధిత అనెక్సర్లు, సర్టిఫికెట్లు

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *