
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 10 గంటల సమయానికి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,150 పెరిగి రూ.1,44,750కు చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.1,32,700గా నమోదైంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,44,600కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,32,550 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.1,44,600కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.950 పెరిగి రూ.1,32,550గా నమోదైంది.
వెండి ధరలు ఇలా..
మరోవైపు వెండి ధరలు ఢిల్లీ, ముంబై మార్కెట్లలో కిలోకు రూ.2,05,000 వద్ద ట్రేడవుతున్నాయి. బంగారం ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆచితూచి కొనుగోళ్లు చేసే పరిస్థితి నెలకొంది.
గమనిక: ఇవి ఉదయం 10 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ధరలు. స్థానిక పన్నులు, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల కారణంగా నగల దుకాణాల్లో ధరలు మారవచ్చు.
