రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB శుభవార్త అందించింది. NTPC విభాగంలో 3,548 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. NTPC గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు ఇప్పటికే దరఖాస్తు గడువు ముగియగా.. అండర్ గ్రాడ్యుయేట్‌ అభ్యర్ధులు మరో మారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, 1,688 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నవంబర్ 13 వరకు అవకాశం ఉంది. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వివరాలు తెలుసుకోండి..

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) శుభవార్త అందించింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) విభాగంలో (CEN No.06/2026) మొత్తం 3,548 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకునే గడువు ముగియగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో మరో అవకాశం కల్పించింది. తాజా నిర్ణయం ప్రకారం NTPC గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులకు నవంబర్ 8, 2026వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. ఇక NTPC UG అభ్యర్ధులకు మాత్రం మరో 4 రోజుల వరకు గడువు పొడిగించింది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నవంబర్ 13 వరకు ఛాన్స్

రైల్వేలో 1,688 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 13 వరకు గడువు ఉంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించే పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా తదుపరి దశల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ సమయంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. పూర్తి వివరాలు, అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ కోసం RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *