Hyderabad: గోల్కొండ బోనాల ఎఫెక్ట్.. ఈ రూట్‌లలో జులై 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు!

Date:

నగరంలోని వాహనదారులకు హైరదాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కీలక సూచనలు చేశారు. శ్రీ జగదంబ మహంకాళి గొల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి ఆ రూట్‌లో ప్రయాణించే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులక కీలక సూచనలు చేశారు. శ్రీ జగదంబ మహంకాళి గొల్కొండ బోనాల ఉత్సవాల దృష్ట్యా, జూలై 19, 23, 26 తేదీలలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొన్ని మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు. గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున.. రామ్‌దేవ్‌గూడ నుండి మక్కై దర్వాజా మీదుగా, లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా, షేక్‌పేట్ నాలా నుండి బంజారా దర్వాజా మీదుగా వచ్చే వాహనదారులు కింద ఇవ్వబడిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని తెలిపారు.

పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

నార్సింగి, సన్ సిటీ, లంగర్ హౌజ్ నుండి షేక్‌పేట్ – ఫిల్మ్ నగర్ – గచ్చిబౌలి మీదుగా మక్కై దర్వాజా- గోల్కొండ కోట – బంజారా దర్వాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను రామ్‌దేవ్‌గూడ వద్ద లంగర్ హౌస్ – బాలికా భవన్ – నానల్ నగర్ వైపు మళ్లిస్తారు.

ఫిల్మ్ నగర్, షేక్‌పేట్ నుండి బంజారా దర్వాజ – మక్కై దర్వాజ మీదుగా వచ్చే ట్రాఫిక్ బంజారా దర్వాజా వెలుపల అల్జాపూర్ రోడ్ – నెక్నాంపూర్ వైపు మళ్లించనున్నారు.

మొఘల్ కా నాలా నుండి లంగర్ హౌజ్ – ఫతే దర్వాజా – గోల్కొండ కోట మీదుగా వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను లంగర్ హౌజ్ ఎక్స్ రోడ్ వద్ద బాలికా భవన్ – నానల్ నగర్ వైపు మళ్లిస్తారు.

ఇదిలా ఉండగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేందకు భక్తల కోసం అధికారులు ప్రత్యేక పార్కింట్ స్లాట్స్ ఏర్పాటు చేశారు. రామ్‌దేవ్‌గూడ నుండి మక్కై దర్వాజా మీదుగా గోల్కొండ కోట వైపు వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలను అషూర్ ఖానా నుండి ఆర్మీ సెంటి పోస్ట్ వరకు పార్క్ చేయవచ్చు, మిగిలిన వాటిని ఆర్టిలరీ సెంటర్ వద్ద పార్క్ చేయవచ్చని పోలీసులు తెలిపారు

ఇక లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోట వైపు వచ్చేవారు తమ బైక్‌లను హుడా పార్క్, గవర్నమెంట్ స్కూల్, ఒవైసీ గ్రౌండ్‌లో పార్క్ చేయాలని సూచించారు.అయితే ఆటో, కార్లను కేవలం ఒవైసీ గ్రౌండ్‌లో మాత్రమే పార్క్ చేయాలని సూచించారు.

షేక్‌పేట్ నుండి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వచ్చే భక్తులు తమ బైక్‌లను గోల్కొండ ఏరియా హాస్పిటల్ వద్ద పార్క్ చేయాలని, కార్లు, లేదా ఆటోలను హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్, డెక్కన్ పార్క్‌లలో పార్క్ చేయవచ్చని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....