తన కుమార్తె వివాహానికి వైఎస్‌ షర్మిలను ఆహ్వానించడంపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పెళ్లికి ఆహ్వానిస్తే కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రక్త సంబంధం ఉన్న సొంత చెల్లెలిపై ఇలాంటి వ్యాఖ్యలు, రాతలు రాయడం ఏమిటని ప్రశ్నించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో రాజకీయంగా తనకు పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినేలా ఎప్పుడూ వ్యవహరించలేదని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత సంబంధాలకు ముడిపెట్టకూడదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *