Indian Railways: ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. భారత్, నేపాల్ మధ్య సాంస్కృతిక..
భారత్, నేపాల్ మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా రామాయణంతో అనుబంధం ఉన్న రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, నేపాల్‌లోని జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ భారతీయ రైల్వే కొత్తగా ‘సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్’ రైలును ప్రారంభించింది. నవంబర్ 23, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించారు.

నవంబర్ 28 నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి
నవంబర్ 23న ప్రారంభించిన ఈ రైలు సేవను సాధారణ ప్రయాణికుల కోసం నవంబర్ 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే రెండు దిశల్లో నడుస్తుంది.
- అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు: ప్రతి సోమవారం.
- జనక్‌పూర్ నుంచి అయోధ్యకు: ప్రతి శనివారం.
రైలు బయలుదేరే సమయాలు ఇవే!
అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు:
- రైలు నంబర్: 15596
- బయలుదేరే సమయం: సోమవారం సాయంత్రం 5:50 గంటలకు.
- జనక్‌పూర్ చేరుకునే సమయం: మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు (నేపాల్ స్థానిక సమయం).
జనక్‌పూర్ నుంచి అయోధ్యకు:
- రైలు నంబర్: 15595
- బయలుదేరే సమయం: శనివారం మధ్యాహ్నం 1:10 గంటలకు (నేపాల్ స్థానిక సమయం).
- అయోధ్య చేరుకునే సమయం: ఆదివారం ఉదయం 8:10 గంటలకు.




