మీకు వచ్చింది గుండెపోటా లేదా పానిక్ అటాకా? ప్రాణాల్ని రక్షించే ముఖ్యమైన తేడాలు, లక్షణాలేంటో క్లియర్‌గా చెప్పిన డాక్టర్

Date:

నేటి రోజుల్లో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. గుండెపోటు వచ్చినప్పుడు ప్రధానంగా కనిపించే లక్షణం ఛాతీ నొప్పి. అయితే, పానిక్ అటాక్ (తీవ్రమైన భయాందోళన) సమయంలో కూడా ఛాతీ నొప్పి కనిపిస్తుంది. దీంతో, చాలా మంది తమకు వచ్చిన పరిస్థితో ఏంటో తెలియక ఆందోళన చెందుతుంటారు. పానిక్ అటాక్, గుండెపోటు రెండు ఒకేలా అనిపించినప్పటికీ, ఇవి రెండు పూర్తిగా భిన్నమైన ఆరోగ్య సమస్యలు

ఈ రెండింటిలోనూ ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం, ‘ఏదో జరిగిపోతుంది’ అనే విపరీతమైన భయం కలగడం వంటి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. అందువల్ల చాలామంది వీటి మధ్య తేడాను గుర్తించలేరు. అయితే, గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే అత్యవసర వైద్య సాయం అందించడం ప్రాణ రక్షణకు చాలా ముఖ్యం కాబట్టి, ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ రెండింటి మధ్య తేడాల్ని డాక్టర్ పవన్ పోద్దార్ (డైరెక్టర్ – క్యాత్ ల్యాబ్ & సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) క్లియర్‌గా వివరించారు.

  • నొప్పి ఎలా ఉంటుంది?: ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున ఏదో బరువైన వస్తువు పెట్టి నొక్కినట్టు, పిండినట్టు లేదా గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది.
  • నొప్పి ఎక్కడికి వ్యాపిస్తుంది?: ఈ నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా ఎడమ చెయ్యి, భుజం, మెడ, దవడ లేదా వీపు భాగాలకు పాకుతుంది.
  • ఇతర లక్షణాలు: చల్లటి చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉంటాయి.
  • సమయం: ఈ లక్షణాలు సాధారణంగా 10 నుంచి 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటాయి. చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ పరిస్థితి మరింత విషమిస్తుంది

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...