మైలోమా సోకితే శరీరంలో కనిపించే లక్షణాలు, నిర్లక్ష్యం చేస్తే ఎముకలతో పాటు కిడ్నీలు దెబ్బతింటాయి!

Date:

ప్రాణాంతకమైన, క్యాన్సర్ ప్లాస్మా కణాలు “M ప్రోటీన్” అనే ఒక అసాధారణ యాంటీబాడీని ఉత్పత్తి చేస్తాయి. ఇది కణితి పెరుగుదల, మూత్రపిండాల దెబ్బతినడం, రోగనిరోధక శక్తి క్షీణించడం, అలాగే ఎముకలు నాశనం కావడం వంటి సమస్యల్ని సృష్టిస్తుంది. మల్టిపుల్ మైలోమా వ్యాపించడం మొదలై, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందినప్పుడు, శరీరం సాధారణ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌లకు స్థలాన్ని కోల్పోతుంది. ఇది క్రమంగా ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తుంది.

మీకు ఎప్పుడూ ఎముకల నొప్పి ఉందా? చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? కాళ్ల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే, ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మల్టీపుల్ మైలోమా కావచ్చు. మల్టీపుల్ మైలోమా అనేది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇది ఎముక మజ్జలో ఉండే ప్లాస్మా కణాలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ప్లాస్మా కణాలు మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సాయపడతాయి

  • కీలకమైన ఎముకల నొప్పి: నిరంతరం ఎముకల నొప్పి ఉండొచ్చు. ముఖ్యంగా వీపు లేదా పక్కటెముకల్లో దీర్ఘకాలంగా ఉండే ఎముకల నొప్పి.
  • తీవ్రమైన అలసట: మైలోమా వల్ల ఎర్ర రక్తకణాలు తగ్గిపోతాయి. దీంతో శరీరం త్వరగా అలసిపోతుంది. అంటే చిన్న చిన్న పనులకే అలసిపోవడం జరుగుతుంది.
  • తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం: ఈ క్యాన్సర్ దెబ్బకి ఇమ్యూనిటీ పవర్ బలహీనపడుతుంది. దీంతో, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.
  • రక్తస్రావం లేదా సులభంగా కమిలిపోవడం: చిన్న దెబ్బలకే శరీరంపై నల్లటి మచ్చలు పడతాయి. లేదా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది.
  • కిడ్నీ సమస్యలు: మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది.
  • శరీరంలో బలహీనత లేదా తిమ్మిర్లు: నరాలు నొక్కబడటం వల్ల చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు రావడం.
  • ఇతర కాంప్లికేషన్లు: ఎముకలు త్వరగా విరిగిపోవడం, రక్తంలో కాల్షియం స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...