రాష్ట్రంలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పొత్తులో భాగంగా కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ల మేయర్‌ పదవులను జనసేన పార్టీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పార్టీ శ్రేణుల సమన్వయంపై జనసేన ప్రత్యేక దృష్టి సారించింది.

పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురువారం ఎన్నికల సమన్వయ కమిటీలను నియమించారు. ఈ మేరకు కమిటీల వివరాలతో కూడిన జాబితాను జనసేన కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.

స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కూటమి భాగస్వామ్య పార్టీలతో నిరంతరం సమన్వయం చేసుకోవడం ఈ కమిటీల ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి ప్రాంతంలో విజయమే లక్ష్యంగా స్థానిక నాయకులతో కలిసి కమిటీలు పనిచేస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

2. శ్రీ కొణతాల రామకృష్ణ, అనకాపల్లి శాసనసభ్యులు

3. శ్రీ పిడుగు హరిప్రసాద్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ

4. శ్రీ బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే

5. శ్రీ బత్తుల బలరామకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే

6. శ్రీ గిడ్డి సత్యనారాయణ, పి. గన్నవరం ఎమ్మెల్యే

7. శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, APMSIDC చైర్మన్

8. శ్రీ సామినేని ఉదయభాను, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు

9. శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్

10. ⁠శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *