
అనకాపల్లి, ఆంధ్రప్రభ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు మరో అవినీతి అధికారి చిక్కారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతుకు చెందిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు ఆయన రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనతో కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
