
రాజకీయ పార్టీల నాయకులతో అభ్యంతరాలపై చర్చ
ముత్తుకూరు, ఆంధ్రప్రభ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించి, వారి అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు.
సమావేశం సామరస్యంగా జరిగిందని ఎంపీడీవో హేమంత్ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
