
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై కాపు నేత దాసరి రాము స్పందించారు. జనసేన పార్టీ బలంగా లేదని పీఏసీ ఛైర్మన్ హోదాలో ఉన్న మనోహర్ ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు. నాలుగు బ్యానర్లు కట్టి, కార్లలో తిరిగితే పార్టీ బలంగా ఉన్నట్లా అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ఎన్ని టికెట్లు వస్తాయనే అంశంపై పీఏసీ ఛైర్మన్ మాట్లాడాల్సిన తీరు ఇదేనా అని దాసరి రాము ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించారు.
జనసేనకు 30 శాతం సీట్లు, 30 శాతం నామినేటెడ్ పదవులు ఇస్తామని పవన్ కల్యాణ్ గతంలో చెప్పారని దాసరి రాము గుర్తుచేశారు. నాదెండ్ల మనోహర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి కుమారస్వామి సీఎం అయిన విషయాన్ని, తెలంగాణలో కేసీఆర్ పొత్తులతో పార్టీని బలోపేతం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించిన దాసరి రాము.. పవన్ కల్యాణ్ కూడా అదే తరహాలో ముందుకు సాగాలని పరోక్షంగా సూచించారు. తమకు రావాల్సిన హక్కులను సాధించుకోకపోతే ఇతరులకు ఉచితంగా సేవ చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
