అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నక్కపల్లి మండలానికి చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీసం నానాజీ వీసం దేవి టీడీపీ కండువాలు కప్పుకుని పసుపు పార్టీలోకి అడుగుపెట్టారు.

నక్కపల్లి మండలం పెదబోదుగాలం గ్రామం నుంచి ఎంపీటీసీగా వీసం నానాజీ విజయం సాధించగా రేబాక గ్రామం నుంచి వీసం దేవి ఎంపీటీసీగా గెలుపొందారు. వీరిద్దరితో పాటు పలువురు నేతలు కూడా టీడీపీలో చేరారు.

నక్కపల్లిలోని హోంమంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనిత వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *