రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ ఘటనలపై తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఎమ్మెల్సీ వర్ల రామయ్య నేతృత్వంలో పర్చూరి అశోక్‌బాబు, ఎస్‌. రాజశేఖర్‌, నీలాయపాలెం విజయ్‌కుమార్‌తో కూడిన టీడీపీ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు అందజేసింది.

కడప, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగుతూ విధ్వంసకర ఘటనలకు పాల్పడుతున్నారని ప్రతినిధి బృందం ఆరోపించింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్న వారిపై విచారణ జరిపి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *