Telangana: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూతురు సహా తల్లిదండ్రి మృతి

Date:

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కల్హేర్‌ మండలం బాచేపల్లి దగ్గర బైక్‌ను తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి తిరిగివస్తారనే భరోసానే లేకుండా పోతుంది. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో.. మృత్యులు ఎలా ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు జనాల గుండెల్లో వణకుపుట్టిస్తున్నాయి. తాజాగా మంగళవారం తెల్లవారుజామును సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.

హైదరబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌ వైపు వెళ్తున్న ఓ కారు సంగారెడ్డి జిల్లాలో ప్రమాదానికి గురైంది. కారు సరిగ్గా కల్హేర్‌ మండలం బాచేపల్లి వద్దకు రాగానే సడెన్‌గా ఓ బైక్‌ కారుకు ఎదురుగా వచ్చింది. అది చూసి కారు డ్రైవర్ వెంటనే బైక్‌ను తప్పించబోగా కారు అదుపుతప్పింది. దీంతో రోడ్డుపై కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన కారును క్రెయిన్ సహాయంతో రోడ్డుపై నుంచి తొలగించి.. ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతులు నాందేడ్ జిల్లాలోని ఒకే ఫ్యామిలీకి చెందిన తల్లిదండ్రులు కూతురుగా గుర్తించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....