
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 25 నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. థియరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే.. సెకండియర్ సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.
ఇక జనవరి 27న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష, జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు తాత్కాలిక షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం అందింది. 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జనరల్, ఒకేషనల్ విభాగాల విద్యార్థులకు ఈ పరీక్షల షెడ్యూల్ వర్తించనుంది.
థియరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థుల పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ – 2027
- ఫిబ్రవరి 24 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
- ఫిబ్రవరి 26 – ఇంగ్లీష్ పేపర్-1
- మార్చి 2 – మ్యాథమెటిక్స్-IA, బోటనీ-1, పొలిటికల్ సైన్స్-1, అకౌంటెన్సీ-1
- మార్చి 5 – మ్యాథమెటిక్స్-IB, జువాలజీ-1, హిస్టరీ-1, కామర్స్-1
- మార్చి 9 – ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1
- మార్చి 12 – కెమిస్ట్రీ-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ-1
- మార్చి 17 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, ఎంఈసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్-1
- మార్చి 19 – మోడ్రన్ లాంగ్వేజ్-1, జాగ్రఫీ-1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు మ్యాథమెటిక్స్-1
విద్యార్థులు పరీక్షల తేదీలను ముందుగానే గుర్తించుకుని అందుకు అనుగుణంగా చదువుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇది తాత్కాలిక షెడ్యూల్ కావడంతో బోర్డు నుంచి వెలువడే అధికారిక తుది టైమ్‌టేబుల్‌ను కూడా పరిశీలించాలి.
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. 2027లో నిర్వహించనున్న ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల తేదీలతో పాటు సైన్స్ గ్రూపుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ – 2027
- ఫిబ్రవరి 25 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
- ఫిబ్రవరి 27 – ఇంగ్లీష్ పేపర్-2
- మార్చి 3 – మ్యాథమెటిక్స్-IIA, బోటనీ-2, పొలిటికల్ సైన్స్-2
- మార్చి 8 – మ్యాథమెటిక్స్-IIB, జువాలజీ-2, హిస్టరీ-2
- మార్చి 12 – ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2
- మార్చి 16 – కెమిస్ట్రీ-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ-2
- మార్చి 18 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2
- మార్చి 20 – మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు మ్యాథమెటిక్స్-2
ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పటి నుంచి?
సైన్స్ గ్రూపుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారాల్లో కూడా నిర్వహించనున్నారు. కాబట్టి విద్యార్థులు తమ పరీక్షల తేదీలు, సమయాలను ముందుగానే గమనించి ప్రిపరేషన్ కొనసాగించడం మంచిది.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు, ఇతర అంతర్గత పరీక్షల షెడ్యూల్‌పై బోర్డు మరిన్ని వివరాలను వెల్లడించింది. ఫస్టియర్ సైన్స్ గ్రూపు విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు మూడు సెషన్లలో జరగనున్నాయి.
ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్ సమయాలు:
- మొదటి సెషన్: ఉదయం 9 నుంచి 11 గంటల వరకు.
- రెండో సెషన్: మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు.
- మూడో సెషన్: మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.
ఇక ప్రాక్టికల్స్‌తో పాటు ఇతర పరీక్షల తేదీలను కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్ విద్యార్థులకు ఇతర పరీక్షల షెడ్యూల్:
- జనవరి 20 నుంచి 25 వరకు – ఫస్టియర్ ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు.
- జనవరి 27 – ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు).
- జనవరి 29 – ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు).
- జనవరి 29 – ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష.
- జనవరి 30 – సెకండియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష.
ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ముందుగానే పరీక్షలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. అన్ని పరీక్షల తేదీలు, సమయాలను విద్యార్థులు తమ కళాశాలల ద్వారా మరోసారి నిర్ధారించుకోవడం మంచిది.
జనరల్ కోర్సుల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రస్తుతం ప్రకటించిన థియరీ పరీక్షల తేదీలే వర్తిస్తాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక పరీక్షల టైమ్‌టేబుల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ తాత్కాలికమైనదని బోర్డు పేర్కొంది. పరీక్షల తేదీలు, సమయాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే అధికారిక ప్రకటనల ద్వారా తెలియజేస్తామని తెలిపింది.
విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది. పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం, మార్పులు, ఇతర వివరాల కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని విద్యార్థులకు సూచించింది.
