ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, సంచరిస్తున్న ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పులిని పట్టుకునే ఆపరేషన్‌లో ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అదే సమయంలో వన్యప్రాణికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించేలా చర్యలు చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, అది సంచరిస్తున్న ప్రాంతాలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఏ.కొండూరు పరిసర అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్న పులిని ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు థర్మల్‌ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అటవీ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు థర్మల్‌ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లను విస్తృతంగా వినియోగించాలని పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సూచించారు. స్థానిక అటవీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ హనుమాన్‌ బృందాల ద్వారా విస్తృతంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఆపరేషన్‌ను పీసీసీఎఫ్‌, చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక ట్రాకింగ్‌, రెస్క్యూ నిపుణుల బృందాలను రప్పించి ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

అలాగే పులి సంచారానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిసర గ్రామాల ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

పులికి, ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదు

పులిని పట్టుకునే ఆపరేషన్‌లో ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించాలని అధికారులకు సూచించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పోలీస్‌, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, ఆపరేషన్‌ పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *