2024లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ప్రజా తిరుగుబాటు అనంతరం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా.. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆమె, కొత్త పాస్‌పోర్ట్‌తో పాటు జాతీయ గుర్తింపు కార్డు (NIC) జారీ చేయాలని కోరుతూ న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించారు.

ఈ ప్రక్రియను తన తరఫున పూర్తి చేసేందుకు బ్రిటిష్ బారిస్టర్ స్టీవెన్ పౌల్స్ కేసీకి అధికారికంగా అనుమతి పత్రం అందజేశారు. తన దరఖాస్తును అత్యవసరంగా పరిగణించి, వీలైనంత త్వరగా స్పందించాలని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను షేక్ హసీనా కోరినట్లు సమాచారం. ఆమె తాజా ప్రయత్నాలతో స్వదేశానికి తిరిగి వెళ్లే అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు కొత్త పాస్‌పోర్ట్‌తో పాటు జాతీయ గుర్తింపు కార్డు (NIC) జారీ చేయాలని కోరుతూ న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ఆమె సంప్రదించారు.

ఈ ప్రక్రియను తన తరఫున పూర్తి చేసేందుకు లండన్‌లోని మ్యాట్రిక్స్ ఛాంబర్స్‌కు చెందిన బ్రిటిష్ బారిస్టర్ స్టీవెన్ పౌల్స్ కేసీని న్యాయ ప్రతినిధిగా నియమించుకున్నారు. తన దరఖాస్తును అత్యవసరంగా పరిగణించి, ఎలాంటి జాప్యం లేకుండా కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డును మంజూరు చేయాలని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను కోరినట్లు సమాచారం.

నవంబర్ 19న న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రహమ్‌కు బ్రిటిష్ బారిస్టర్ స్టీవెన్ పౌల్స్ లేఖ రాశారు. నవంబర్ 9న తాను పంపిన లేఖకు కొనసాగింపుగా ఈ లేఖను పంపినట్లు పేర్కొన్నారు. షేక్ హసీనా తరఫున తాను వ్యవహరిస్తున్నట్లు ధ్రువీకరించే ఆధారాలు సమర్పించాలని హైకమిషన్ కోరిన నేపథ్యంలో, ఆమె స్వయంగా సంతకం చేసిన అధికార పత్రాన్ని తాజాగా జతచేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా పరిగణించి వీలైనంత త్వరగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

తన తరఫున న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు (NIC) కోసం దరఖాస్తు చేసేందుకు స్టీవెన్ పౌల్స్ కేసీకి పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు షేక్ హసీనా ఆ పత్రంలో స్పష్టం చేశారు.

కాగా, 2024లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న భారీ ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన షేక్ హసీనా ప్రాణరక్షణ కోసం భారత్‌కు వచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల వచ్చే డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తానని ఆమె ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ పత్రాల కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తే అక్కడ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2024లో నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ న్యాయస్థానం ఇప్పటికే ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లే అంశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష పడేలా వాదించిన బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ ఎండీ అమీనుల్ ఇస్లాం ఈ నెల ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉంటున్న స్వచ్ఛంద ప్రవాసాన్ని ముగించుకుని హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే, న్యాయస్థానం విధించిన మరణశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అయితే, ఆ గడువు ఇప్పటికే ముగిసిపోయిందని, దీంతో ప్రస్తుతం హసీనాకు అప్పీల్ చేసుకునే న్యాయపరమైన అవకాశం కూడా లేదని అమీనుల్ ఇస్లాం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *