
తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీరంగంలో కొలువైన శ్రీ రంగనాథస్వామివారికి శుక్రవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న టీటీడీ ఈవోకు జాయింట్ కమిషనర్ ప్రకాష్, ప్రధానార్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారు.
